Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ అదుర్స్.. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్.. ధర, ఫీచర్లు కేక.. 5 బిగ్గెస్ట్ హైలెట్స్..!

Apple iPhone Air : అత్యంత సన్నని ఆపిల్ ఐఫోన్ ఎయిర్ మోడల్ వచ్చేసింది. ఫీచర్లు మాత్రం కిర్రాక్ ఉన్నాయి.. ధర ఎంతంటే?

1/10
Apple iPhone Air : మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలో జరిగిన 'అవే డ్రాపింగ్' ఈవెంటులో ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మందం కేవలం 5.6 మిమీ మాత్రమే. ప్రపంచ మార్కెట్లో అత్యంత సన్నని ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ఇదే.
2/10
ఈ ఐఫోన్ అడ్వాన్స్ A19 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతుంది. భారతీయ మార్కెట్లో ఈ ఐఫోన్ ధర రూ. 1,19,900కు లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా-స్లిమ్ డిజైన్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీతో వస్తుంది. ఇంతకీ భారతీయ యూజర్లకు ఈ ఐఫోన్ ఎయిర్ ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/10
ఐఫోన్ ఎయిర్ 5 హైలెట్స్ ఇవే : 1. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఐఫోన్ : కేవలం 5.6mmతో ప్రపంచంలోనే అత్యంత సన్నని ఐఫోన్. ఐఫోన్ 6, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ రెండింటి కన్నా సన్నగా ఉంటుంది. టైటానియం ఫ్రేమ్, సిరామిక్ షీల్డ్ 2 బరువు విషయంలో రాజీ పడకుండా ఎక్కువ మన్నిక అందిస్తాయి.
4/10
2. పవర్‌ఫుల్ A19 ప్రో చిప్ : అల్ట్రా-సన్నగా ఉన్నప్పటికీ ఆపిల్ పర్ఫార్మెన్స్ విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. ఐఫోన్ ఎయిర్ ఐఫోన్ 17 ప్రో సిరీస్‌లో కనిపించే అదే 3nm A19 ప్రో ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. భారతీయ యూజర్లకు మల్టీ టాస్కింగ్, గేమింగ్, ఏఐ ఆధారిత ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది.
5/10
3. ప్రోమోషన్ 6.5-అంగుళాల డిస్‌ప్లే : ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల ప్రోమోషన్ డిస్ప్లేతో వస్తుంది. పవర్ ఫుల్ విజువల్స్, మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్రికెట్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేయడం, OTT కంటెంట్‌ను చూడటం లేదా గేమింగ్ అయినా భారతీయ యూజర్లకు ప్రీమియం విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
6/10
4. ఫాస్ట్ ఛార్జింగ్‌తో లాంగ్ బ్యాటరీ : ఆపిల్ ఇంకా కచ్చితమైన బ్యాటరీ సామర్థ్యాన్ని వెల్లడించలేదు. సింగిల్ ఛార్జింగ్ రోజంతా వస్తుంది. స్పీడ్ వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో భారతీయ యూజర్లు త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ప్రయాణంలో ఉన్నవారికి బెస్ట్. కొత్త మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది.
7/10
5. స్మార్ట్ ఫీచర్లతో ఆకర్షణీయమైన కెమెరా : ఐఫోన్ ఎయిర్ 48MP బ్యాక్ కెమెరా, ఏకకాలంలో రికార్డింగ్ సామర్థ్యం, వైడ్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ప్రో మోడల్‌ మాదిరిగా అడ్వాన్స్ లేనప్పటికీ పోర్టబిలిటీని అందిస్తుంది. భారతీయ మార్కెట్లో రోజువారీ ఉపయోగం, సోషల్ మీడియా క్రియేటర్లకు అనుకూలంగా ఉంటుంది.
8/10
భారతీయ యూజర్లకు ప్రయోజనాలేంటి? : రోజువారీ ప్రయాణానికి బెస్ట్ : ఎక్కువ ప్రయాణ సమయాల్లో ఫోన్‌లను తీసుకెళ్లే వ్యక్తులకు సరైన ఐఫోన్.
9/10
ఏఐ ఆధారిత ఫీచర్లు : ఆపిల్ ఇంటెలిజెన్స్ రియల్-టైమ్ ట్రాన్సులేషన్, ప్రొడక్టవిటీ టూల్స్, స్మార్ట్ సిరి, భారతీయ విద్యార్థులు, నిపుణులకు బెస్ట్ ఫోన్. సన్నని డిజైన్‌ : IP-రేటెడ్ బిల్డ్ భారతీయ వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా ఉంటుంది.
10/10
కొత్త ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (డ్యూయల్ కెమెరాలతో 5.8mm స్లిమ్), వన్ ప్లస్ ఓపెన్ స్లిమ్ ఎడిషన్ కు పోటీగా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ రెండూ సన్నని ఫోన్లు ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి. అయితే, ఆపిల్ బ్రాండ్ వాల్యూ, సాఫ్ట్‌వేర్ అప్ డేట్స్ భారతీయ ప్రీమియం మార్కెట్‌లో మరింత పుంజుకోవచ్చు. ఐఫోన్ ఎయిర్ 256GB వేరియంట్ సెప్టెంబర్ 9 నుంచి భారత మార్కెట్లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.