కొత్త ఆపిల్ వాచ్ రాబోతుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 11 లాంచ్ కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 10 ధర భారీగా తగ్గింది. ఈ ఆపిల్ వాచ్ గత ఏడాదిలో ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు లాంచ్ అయింది. ఈ వేరబుల్ డివైజ్ ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 49,500 లోపు అందుబాటులో ఉంది.
2/6
ముఖ్యంగా, ఈ డీల్ GPS + సెల్యులార్ సపోర్ట్‌తో 46mm జెట్ బ్లాక్ అల్యూమినియం వేరియంట్‌లపై అందుబాటులో ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 10 మోడల్ 46mm GPS + సెల్యులార్ వేరియంట్ రూ. 59,900 ప్రవేశపెట్టారు. కొత్త ఆపిల్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 10 (42mm GPS) రూ.50,999 ధరకు లభిస్తుంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై కస్టమర్లు అదనంగా రూ.1,750 ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా ధర రూ.48,249కి తగ్గుతుంది. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. పాత స్మార్ట్‌వాచ్‌లపై రూ. 300 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కొనుగోలుదారులు మరింత ఆదా చేసుకోవచ్చు.
4/6
ఆపిల్ వాచ్ సిరీస్ 10 42mm, 46mm సైజులలో వస్తుంది. రెండూ OLED రెటినా డిస్ ప్లే కలిగి ఉంటాయి. ప్రధానంగా ఆపిల్ S10 SiP చిప్‌సెట్ కూడా ఉంది. హెల్త్, ఫిట్‌నెస్ ప్రొడక్టివిటీ ఫీచర్లకు పవర్ అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ 18 గంటల వరకు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
5/6
ఈ స్మార్ట్ వాచ్ లో స్లీప్ అప్నియా డిటెక్షన్, ఫాల్ అండ్ క్రాష్ డిటెక్షన్, హృదయ స్పందన రేటు మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వైటల్స్ యాప్ కూడా కలిగి ఉంది. మొత్తం హెల్త్ మెట్రిక్స్ కు ఈజీ యాక్సెస్ అందిస్తుంది. ఈ వాచ్ లో క్లియర్ కాల్స్ కోసం వాయిస్ ఐసోలేషన్ కూడా ఉంది. అలాగే సిరితో పాటు ఆన్-డివైస్ ప్రాసెసింగ్ కూడా ఉంది.
6/6
ఇంకా, ఆపిల్ వాచ్ సిరీస్ 10 డబుల్ ట్యాప్ గెచర్స్, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో డిజిటల్ క్రౌన్, నావిగేషన్ కోసం సైడ్ బటన్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో ECG, బ్లడ్ ఆక్సిజన్, పీరియడ్స్ సైకిల్ ట్రాకింగ్, మందులు, మైండ్‌ఫుల్‌నెస్, నాయిస్, స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్ యాప్‌లు కూడా ఉన్నాయి. ఈ ఆపిల్ వాచ్ 50 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.