iPhone 17 Series : ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేస్తున్న ఆపిల్… పాత ఫోన్ల మీద బీభత్సంగా రేట్ల తగ్గింపు..
iPhone 17 Series : ఆపిల్ ఈవెంట్ 2025 ఐఫోన్ 17 సిరీస్ రిలీజ్ కానుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిన వెంటనే ఆపిల్ ప్రొడక్టుల ధరలు తగ్గనున్నాయి.

iPhone 17 Series
Apple Awe Dropping Event : ఆపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఆపిల్ ఈరోజు (సెప్టెంబర్ 9, 2025) ‘Awe Dropping’ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ (Apple Awe Dropping Event) చేయనుంది. ఈ సిరీస్‌తో పాటు, కంపెనీ వాచ్ సిరీస్ 11, ఎయిర్‌పాడ్ ప్రో 3 వంటి అనేక ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిన వెంటనే అనేక ఆపిల్ ప్రొడక్టులు చౌకగా మారనున్నాయి.
కంపెనీ ప్రతి ఏడాదిలో కొత్త ఐఫోన్ సిరీస్‌ను రిలీజ్ చేస్తుంది. అదే సమయంలో పాత ఐఫోన్ మోడళ్ల ధరలు కూడా తగ్గనున్నాయి. ఆపిల్ అనేక పాత ఐఫోన్ మోడళ్లను కూడా నిలిపివేయనుంది. కేవలం ఐఫోన్‌లు మాత్రమే కాకుండా ఇతర ఆపిల్ ప్రొడక్టులు కూడా చౌకగా మారనున్నాయి.
iPhone 17 Series : చౌకగా మారనున్న ఐఫోన్లు ఇవే :
నివేదికల ప్రకారం.. ఆపిల్ ఈవెంట్ 2025 తర్వాత ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ నిలిచిపోనున్నాయి. అలాగే, గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్స్ కూడా నిలిచిపోనున్నాయి. ఇదే జరిగితే.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో కొత్త ఆపిల్ ఐఫోన్ లాంచ్ తర్వాత కూడా పాత ఐఫోన్ల మోడల్స్ ధరలు భారీగా దిగొస్తాయని అంచనా.
గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈవెంట్ తర్వాత ఆపిల్ అధికారికంగా ఐఫోన్ 15 ధరలను రూ. 10వేలు తగ్గించింది. అయితే, 2023లో ఐఫోన్ లాంచ్ ఈవెంట్ తర్వాత ఐఫోన్ 14 ధరలను కూడా అదే మొత్తంలో తగ్గించింది. పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఐఫోన్ 16 మోడల్స్ అతి చౌకగా లభించనున్నాయి. సాధారణంగా దీపావళి సేల్‌లో పాత ఐఫోన్ మోడళ్లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.
ఆపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్ ధరలు తగ్గింపు :
ఆపిల్ ఈవెంట్‌లో కొత్త స్మార్ట్‌వాచ్ కూడా లాంచ్ కానుంది. నివేదికల ప్రకారం.. కంపెనీ ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా 2, సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ SE మోడల్ కూడా నిలిపివేయనుంది. ఎందుకంటే.. ఆయా అప్‌గ్రేడ్ చేసిన మోడళ్లను ఆపిల్ ఈవెంట్‌లో ప్రవేశపెట్టనుంది. తద్వారా పాత ఆపిల్ వాచ్ మోడల్స్ తక్కువ ధరకు లభించనున్నాయి.
ఐఫోన్ 17 సిరీస్ పై భారీ అంచనాలివే? :
“అవే డ్రాపింగ్” ఈవెంట్‌లో ఆపిల్ 4 ఐఫోన్ మోడళ్లలో ప్రోమోషన్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లేలతో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ గతంలో ఐఫోన్ ప్రో మోడళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, స్టాండర్డ్, ఎయిర్ మోడళ్లలో ప్రవేశపెట్టడంతో ఈ ఐఫోన్‌లకు ప్రీమియం లుక్ అందిస్తుంది. టెక్ దిగ్గజాల ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కూడా 12GB ర్యామ్ సపోర్ట్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు.
అదేవిధంగా, స్టాండర్డ్ మోడల్‌లో 8GB ర్యామ్ కూడా ఉండొచ్చు. ప్రో మోడల్స్ ఆపిల్ కొత్త A19 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతాయి. ఐఫోన్ 17, ఎయిర్ వేరియంట్లు A19 చిప్‌సెట్‌పై రన్ అవుతాయి. ఐఫోన్ 17 ప్రో లైనప్, ఐఫోన్ 17 ఎయిర్ కూడా మెయిన్ డిజైన్ మార్పులను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే, ఐఫోన్ 17 గత ఏడాది మాదిరిగానే అదే డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది.