Telugu » Photo-gallery » Celebrities Pay Tribute To The Father Of The Nation Mahatma Gandhi Photo Gallery
Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీకి ప్రముఖుల ఘన నివాళి.. ఫొటో గ్యాలరీ
Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖార్గేలతో పాటు పలువురు గాంధీ సమాధివద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. భారత్ జోడో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాకటలోని ఖాదీ గ్రామోద్యోగ్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.