×
Ad

తిలక్ వర్మకు చిరంజీవి ఘన సన్మానం.. వైరల్ అవుతున్న ఫొటోలు.. ఎవరెవరు ఉన్నారంటే?

ఆసియాకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సెట్‌లో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్వయంగా పూల మాలతో తిలక్ వర్మను సన్మానించి, ఆయన అద్భుతమైన ప్రతిభను ఎంతగానో కొనియాడారు. కేవలం సన్మానంతో ఆగకుండా, మూవీ సెట్‌లో తిలక్ వర్మతో కలిసి కేక్ కట్ చేశారు. అంతేకాదు, ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ విజయ క్షణాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక ఫోటోను చిరంజీవి బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమంలో నయనతార, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, కేథరిన్‌ థ్రెసా, సుష్మిత కొణిదెలతో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6