×
Ad

Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. నథింగ్ ఫోన్ 3aపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!

Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ అతి త్వరలో ప్రారంభం కానుంది. నథింగ్ ఫోన్ 3a సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

1/6
Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 4 రోజుల్లో మెగా సేల్ లైవ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే మల్టీ బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది.
2/6
మీరు మిడ్-రేంజ్ ఫోన్ లేదా ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ద్వారా మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. మీరు నథింగ్ అభిమాని అయితే నథింగ్ ఫోన్ 3a అతి తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో నథింగ్ ఫోన్ 3a ధర తగ్గింపు : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8GB ర్యామ్ కలిగిన నథింగ్ ఫోన్ 3a వేరియంట్ రూ.20,999కి అందుబాటులో ఉంటుంది. అసలు లాంచ్ ధర రూ.24,999 నుంచి తగ్గింపు పొందింది. అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకులతో కొంచెం ఎక్కువ తగ్గింపును పొందవచ్చు. ఈ నథింగ్ ఫోన్ 3a బ్లాక్, వైట్ అనే రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4/6
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : నథింగ్ ఫోన్ 3a బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఆఫర్, అడ్రినో 810 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో వస్తుంది. 4nm ప్రాసెస్ ఆధారంగా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌ కలిగి ఉంది.
5/6
120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. నేరుగా సూర్యకాంతిలో కూడా అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. నథింగ్ 3 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
6/6
నథింగ్ ఫోన్ 3aలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ షూటర్, 2X ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 32MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీతో పాటు 50W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.