Google Pixel 9 : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ 9 ధర భారీ తగ్గింపు ధరకే లభించనుంది.
2/8
లాంచ్ ధరలో సగం కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 35వేల కన్నా డిస్కౌంట్ ధరకు పొందవచ్చు.
3/8
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే డీల్స్, ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా, గూగుల్ పిక్సెల్ 9 OLED డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
4/8
ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌లో పిక్సెల్ 9 డీల్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 రూ.64,999 ధరకు లిస్ట్ అయింది. లాంచ్ ధర రూ.79,999 నుంచి రూ.15వేలు తగ్గింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్ అన్ని ఆఫర్‌ల తర్వాత రూ.34,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.
5/8
ICICI, Axis బ్యాంక్ కార్డులపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్, పాత ఫోన్ ట్రేడ్-ఇన్‌పై రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. కొనుగోలుదారులు లాంచ్ ధరలో సగం కన్నా తక్కువ ధరకే ఫోన్ పొందవచ్చు.
6/8
గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 6.9-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080 x 2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌తో వస్తుంది. అలాగే, స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
7/8
గూగుల్ పిక్సెల్ 9 టెన్సర్ G4 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఇంకా, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీని అందిస్తుంది.
8/8
ఆప్టిక్స్ పరంగా పిక్సెల్ 9 బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 10.5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.