Honor Turbo 5G : కొత్త హానర్ టర్బో 5G వచ్చేసింది.. కెమెరా ఫీచర్లు అదుర్స్, ధర జస్ట్ ఎంతంటే?
Honor Turbo 5G : హానర్ నుంచి డ్యూయల్ 50ఎంపీ కెమెరాలు, 8560mAh బ్యాటరీతో హానర్ టర్బో 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర ఎంతకు లభిస్తుంది? కలర్ వేరియంట్ల వారీగా ఎలా ఉన్నాయంటే?
- Sreehari A
- Updated on- August 23, 2026 / 04:23 PM IST
Honor Turbo 5G : హానర్ నుంచి అద్భుతమైన ఫోన్.. కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా హానర్ టర్బో 5జీ లాంచ్ చేసింది. 6.79-అంగుళాల, 1.5K డిస్‌ప్లే, అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 8560mAh బ్యాటరీతో వస్తుంది.
కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో సహా అనేక ఇతర ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఈ హానర్ టర్బో 5జీ ధర, ముఖ్య ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ధర ఎంతంటే? :
కంపెనీ హానర్ టర్బో 5జీని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. యూరేషియన్ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర 33,990 రూబుల్స్ (దాదాపు రూ. 39,300). ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ (Honor.com)లో లిస్టు అయింది. ఈ ఫోన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
హానర్ టర్బో 5జీ ఫోన్ 6.79-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే అద్భుతమైన 1.5K రిజల్యూషన్ స్క్రీన్‌ను అమర్చింది. ఫుల్ HD+ రిజల్యూషన్ ఈ ఫోన్‌కు హై కాంట్రాస్ట్ రేషియో ఉంది. DCI P3 కలర్ గామట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 6000 నిట్స్ అందిస్తుంది. ఈ ఫోన్ కేవలం 1.3mm మందంతో అత్యంత సన్నని బెజెల్స్‌తో వస్తుంది.
ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ సింగిల్-కోర్ పరీక్షలో 1,070 పాయింట్లు, మల్టీ-కోర్ పరీక్షలో 3,060 పాయింట్లు సాధించింది. ఈ ఫోన్‌లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
కెమెరా పరంగా చూస్తే.. హానర్ టర్బో 5జీలో 50MP మెయిన్ రియర్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. 8,560mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ ఉంది. ఈ ఫోన్ బరువు 196 గ్రాములు ఉంటుంది.
