×
Ad

INDW vs SLW T20 : అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్లు.. శ్రీలంకపై వరుసగా ఐదో విజయం.. ఫొటో గ్యాలరీ

INDW vs SLW T20 : ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది.

1/14
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది.
2/14
సిరీస్‌లోని చివరి మ్యాచ్ మంగళవారం రాత్రి తిరువనంతపురం వేదికగా జరిగింది.
3/14
చివరి మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో శ్రీలంక మహిళల జట్టుపై భారత మహిళల జట్టు విజయం సాధించింది.
4/14
టాస్ గెలిచిన శ్రీలంక మహిళల జట్టు తొలుత బౌలింగ్ తీసుకుంది. దీంతో భారత మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.
5/14
తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయగా.. హర్మన్ ప్రీత్ (68) రాణించడంతో భారత జట్టు 7వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది.
6/14
అరుంధతి రెడ్డి (27నాటౌట్) చివరిలో బ్యాట్ ఝుళిపించింది.
7/14
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకిదిగిన శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
8/14
శ్రీలంక బ్యాటర్లలో హాసిని (65), చమరి (50) రాణించినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో శ్రీలంక జట్టు ఓటమి పాలైంది.
9/14
హైదరాబాదీ క్రికెటర్ అరుంధతీ డెత్ ఓవర్లలో చేసిన పరుగులే మ్యాచ్ విజయంలో కీలకమయ్యాయి.
10/14
చివరి మ్యాచ్ లో స్మృతి మంధాన ఆడలేదు. ఆమెకు టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది.
11/14
హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. షెఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికైంది.
12/14
టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు 5-0తో సిరీస్ గెలవడం ఇది మూడోసారి. సొంతంగడ్డపై మొదటిసారి.
13/14
తమిళనాడుకు చెందిన గుణాలన్‌ కమలిని ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. భారత్‌ తరఫున టి20 మ్యాచ్‌లు ఆడిన 90వ క్రీడాకారిణిగా కమలిని గుర్తింపు పొందింది
14/14
భారత జట్టు ప్లేయర్ దీప్తి శర్మ మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగాన్ షట్ (151)ను అమె అధిగమించింది.