Telugu » Photo-gallery » Minister Roja In The Program Gadapa Gadapaku Mana Govt
AP Minister Roja: వర్షమొచ్చినా ఆగేదిలే.. వర్షంలోనూ ‘గడప గడపకు మన ప్రభుత్వం’కార్యక్రమంలో మంత్రి రోజా
పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సచివాలయం పరిదిలోని పరమేశ్వర మంగళం, వడ్డిఇండ్లు గ్రామాలలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. వర్షం వస్తున్నా రోజా గొడుగు సహాయంతో ఇంటింటికి వెళ్లారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను రోజా దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.