Motorola Edge 50 Ultra 5G : కళ్లుచెదిరే డీల్.. ఈ మోటోరోలా అల్ట్రా 5Gపై భారీ తగ్గింపు.. అమెజాన్‌లో ఇప్పుడు తగ్గిందంటే?
Motorola Edge 50 Ultra 5G : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా రూ. 17వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- August 4, 2026 / 01:09 PM IST
Motorola Edge 50 Ultra 5G : మోటోరోలా ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. మంచి ప్రీమియం కోసం చూస్తున్నారా? అయితే, ఇంతకన్నా బెస్ట్ టైమ్ ఉండదు. తక్కువ ఖర్చులో ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ధరపై రూ .17వేలు డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది.
అలాగే, టెలిఫోటో లెన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్, ట్రిపుల్-కెమెరా సెటప్ అందిస్తుంది. ఇలాంటి అల్ట్రా ఫోన్లపై డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మంచి ఆల్ రౌండ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ డీల్ అమెజాన్‌లో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G అమెజాన్ డీల్ :
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ .64,999 ఉంటుంది. కానీ, ఈ మోటోరోలా ఫోన్ కేవలం రూ .47,990కే లభిస్తుంది. లాంచ్ ధరపై రూ .17,009 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలుదారులు మరో రూ .వెయ్యికు తగ్గించవచ్చు. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఈ మోటోరోలా ఫోన్ కోసం నో-కాస్ట్ ఈఎంఐ నెలకు కేవలం రూ .1,687 కడితే చాలు.. అంతేకాదు.. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ బ్రాండ్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ బోనస్‌తో రూ .33,500 వరకు తగ్గుతుంది.
ఈ మోటోరోలా ఫోన్ కొనాలా? వద్దా? :
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 2,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. బయట ఫోన్ వాడినా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది.
ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 ఇంజిన్‌తో రన్ అవుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, రోజువారీ వినియోగానికి స్టేబుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాదు.. 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్, బ్యాక్ సైడ్ 64MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 4500mAh బ్యాటరీతో 125 వాట్ల ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కేబుల్స్ లేకుండా ఫాస్ట్ ఛార్జ్ చేసేవారికి 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్టు ఇస్తుంది.
