నందమూరి కుటుంబంలో ఎలాంటి వేడుకలు, పెళ్లిళ్లు అయినా అల్లుళ్ళగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరిస్తారు
నందమూరి కుటుంబ వారసులకు సంబంధాలు చూడడంలో వెంకటేశ్వరరావు, చంద్రబాబు పూర్తి బాధ్యతలను తీసుకుంటారు
ముఖ్యంగా చంద్రబాబు ఇలాంటి విషయాలలో అన్నీ తానై వ్యవహరిస్తారు
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహంలో భాగంగా పెళ్లి కుమార్తెను చేసే వేడుకను ఈ మూడు కుటుంబాలు కలిసి ఘనంగా నిర్వహించాయి
రాజకీయపరంగా పరస్పర విరుద్ధంగా కనిపించే చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించారు
పురంధేశ్వరి-భువనేశ్వరి ఈ వేడుకను అన్నీ తానై జరిపించారు
అటు పురంధేశ్వరి, ఇటు భువనేశ్వరి కూడా శుభకార్యాలు, వేడుకలలో ఇంటి ఆడపడుచులుగా ముందుంటారు
చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు
చంద్రబాబు-భువనేశ్వరి, వెంకటేశ్వరరావు-పురంధేశ్వరి దంపతులు ఎన్టీఆర్ మనవరాలిని ఆశీర్వదించిన దృశ్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి
ఈ వేడుకలో వెంకటేశ్వరరావు, చంద్రబాబు తోడల్లుళ్లుగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు
చాలా కాలం తర్వాత నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు ఒకే వేదికపై కనిపించాయి
మరోసారి నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబాలు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిగా మారింది