Nara Bhuvaneswari : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిల్డ్రన్స్ హోంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఉండవల్లి గ్రామంలోని చిగురు చిల్డ్రన్స్ హోంలోని పిల్లలతో కలిసి భువనేశ్వరి టపాసులు కాల్చారు. చిన్నారులకు స్వీట్లు పంచి పెట్టారు. వారికి భోజనం వడ్డించారు. పిల్లలతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.