Pawan Kalyan : రేపే పవర్ స్టార్ బర్త్ డే.. మరి OG 2 సంగతేంటి..?

పవన్‌ అభిమానులతో పాటు ఆడియెన్స్‌ అటెన్షన్‌ అంతా ఓజీ 2 సినిమా మీదే ఉన్నాయి. (Pawan Kalyan)

  • Published on- September 1, 2026 / 09:09 PM IST

Pawan Kalyan

Pawan Kalyan : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఫుల్‌ సెలబ్రేషన్‌ మూడ్‌లో ఉన్నారు. ఓ వైపు పంజా సినిమా రీరిలీజ్‌తో ఇప్పటికే హంగామా మొదలెట్టిన ఫ్యాన్స్.. ఇంతకు మించిన సర్‌ప్రైజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్‌ 2న పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు రెడీ అయ్యారు పవర్‌స్టార్‌ అభిమానులు. సెలబ్రేషన్స్‌ సహా పవర్‌స్టార్‌ అప్‌కమింగ్‌ సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం.. అంతే ఎగ్జైట్మెంట్‌తో ఎదురు చూస్తున్నారంతా.

అయితే ఈ లిస్ట్‌లో పవన్‌ అభిమానులతో పాటు ఆడియెన్స్‌ అటెన్షన్‌ అంతా ఓజీ 2 సినిమా మీదే ఉన్నాయి. సుజీత్‌ డైరెక్షన్‌లో తెరకెక్కే ఈ మోస్ట్‌ స్టయిలిష్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా సీక్వెల్‌ నుంచి పవర్‌స్టార్‌పై స్పెషల్ యానిమేషన్‌ వీడియో ఏ టైమ్‌కి రిలీజయ్యే చాన్సుందని సాలిడ్‌ హైప్‌తో ఎదురుచూస్తున్నారు అభిమానులు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజున ఓజీ 2 సినిమా నుంచి సాలిడ్‌ ట్రీట్‌ ఉంటుందని ఇప్పటికే అభిమానులకి మాట కూడా ఇచ్చారు మేకర్స్.

Also See : Rasika Dugal : హైదరాబాద్‌లో సందడి చేసిన మీర్జాపూర్ ‘బీనా త్రిపాఠి’.. రసిక దుగల్ ఫొటోలు వైరల్..

ఇటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సైతం.. కొన్ని సందర్భాల్లో ఓజీ 2 నుంచి సర్‌ప్రైజ్‌ ఉంటుందని హింట్‌ ఇస్తూ వచ్చారు. అయితే ప్రజెంట్‌ ఓజీ 2కి సంబంధించి ఎలాంటి హడావిడి లేకపోవడంతో అందరిలోనూ డౌట్స్‌ రైజ్‌ అవుతున్నాయి. మేకర్స్‌ సైడ్‌ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ లేకపోవడంతో ఓజీ 2 పవర్‌స్టార్‌ యానిమేషన్‌ వీడియోపై డైలమా క్రియేటవుతుంది. రేపటి వరకు OG 2 సినిమా అప్డేట్ ఏమైనా ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఒకవేళ రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకి ఓజి 2 అప్డేట్ ఇస్తే మాత్రం ఫ్యాన్స్ కి పండగే. మరి పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకి ఓజీ 2 మేకర్స్‌ ఏ రేంజ్‌ అప్‌డేట్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తారో చూడాలి.