PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం మహారాష్ట్రలో మోదీ పర్యటించారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్‌లో నూతన మెట్రో ఫేస్1 సేవలను మోదీ ప్రారంభించారు. అనంతరం స్వయంగా టికెట్ కొనుగోలు చేసి ఫ్రీడం పార్క్ స్టేషన్ నుంచి ఖాప్రి స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రయాణికులు, విద్యార్థులతోపాటు రైల్వే సిబ్బందితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. అంతకుముందు మహారాష్ట్రలోని నాగపూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ల మధ్య సేవలందించే దేశంలో ఆరో వందే భారత్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు.