రాఖీ పండుగ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద రక్షాబంధన్ వేడుకల్లో ప్రధాని చిన్నారులతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. నా యువ స్నేహితులు, నేను చాలా విషయాలు గురించి మాట్లాడుకున్నాం. చంద్రయాన్ -3, అంతరిక్షంలో భారతదేశం సాధించిన పురోగతిపై వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. వారు అద్భుతమైన కవిత్వం కూడా చెప్పారు అంటూ ప్రధాని ట్వీట్ లో పేర్కొన్నారు.