Telugu » Photo-gallery » Rahul Gandhis Ongoing Bharat Jodo Yatra In Ap Photo Gallery
Bharat Jodo Yatra: ఏపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం ఏపీలో కొనసాగింది. 43వ రోజు యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా బనవాసి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు బదులుగా గురువారం 5:30 గంటలకు జెండా ఎగురవేయడంతో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో ఉదయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు.