Peddi: రామ్ చరణ్ మాట ఒకటి.. పోస్టర్ చెప్పేది ఇంకొకటా.. ‘పెద్ది’పై ఏదో ఒక క్లారిటీ ఇవ్వండయ్యా!
హనుమాన్ జయంతి సందర్బంగా విడుదల చేసిన పెద్ది(Peddi) స్పెషల్ పోస్టర్ లో రిలీజ్ డేట్ మిస్.
- V Santhosh Kumar
- Published On : April 3, 2026 / 07:13 AM IST
ram charan peddi release date confusion
- ‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై వీడని ఉత్కంఠ
- హనుమాన్ జయంతి స్పెషల్ పోస్టర్‌లో డేట్ మిస్
- కఫ్యూజన్ లో మెగా ఫ్యాన్స్
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడనుందని, జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలతో అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అయితే, ఇటీవల రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కాస్త కన్ఫ్యూజన్ ను క్లియర్ చేశాయి. ‘రాకాస’ సినిమా టీంను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘పెద్ది(Peddi)’ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, ప్రకటించినట్లుగా ఏప్రిల్ 30నే థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు.
కానీ, తాజాగా హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ మళ్లీ కొత్త అనుమానాలను క్రియేట్ చేసింది. సాధారణంగా ఇలాంటి క్రేజీ ప్రాజెక్టుల పోస్టర్లపై విడుదల తేదీని ప్రముఖంగా ప్రస్తావిస్తారు, కానీ ఈ పోస్టర్‌లో రిలీజ్ డేట్ ఎక్కడా కనిపించకపోవడంతో వాయిదా వార్తలకు మళ్లీ బలం చేకూరింది. ఒకవైపు హీరో విడుదల తేదీ మారదని చెబుతుంటే, మరోవైపు అధికారిక పోస్టర్లలో డేట్ లేకపోవడం అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది.
షూటింగ్ పెండింగ్ ఉందా లేక పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమవుతుందా అనే కోణంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిత్ర బృందం వెంటనే స్పందించి, విడుదల తేదీపై ఒక అధికారిక క్లారిటీ ఇవ్వాలని, ఈ కన్ఫ్యూజన్ లో క్లియర్ చేయాలనీ మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. సినిమా ప్రమోషన్లు వేగవంతం చేయాల్సిన సమయంలో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండటం ఆందోళన కలిగిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఇకనైనా అధికారిక ప్రకటన చేస్తారా అనేది చూడాలి.
