నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ళ తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుంది. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో కనిపించబోతుంది రేణు దేశాయ్. ఈ రియల్ పాత్రకోసం అచ్చంగా హేమలత లవణంలా కనపడేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఇలా తెల్లచీర, కళ్ళజోడు పెట్టుకొని రెడీ అయింది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.