Samsung Galaxy A27 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ కొత్త 5G ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

Samsung Galaxy A27 5G : శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ చెక్ రిపబ్లిక్‌లోని శాంసంగ్ వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

1/7
Samsung Galaxy A27 5G : శాంసంగ్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రానుంది. ఇప్పటికే, శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ చెక్ రిపబ్లిక్‌లోని శాంసంగ్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది.
2/7
ఈ స్మార్ట్‌ఫోన్ 128GB, 256GB స్టోరేజ్‌లో లభ్యం కానుంది. ఈ డివైజ్ ఫ్లాట్ ప్యానెల్ పిల్-షేప్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. గత ఏడాది మార్చిలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ A26 5జీకి అప్‌గ్రేడ్‌గా వస్తుంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో రావొచ్చు.
3/7
పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ స్మార్ట్‌ఫోన్ రైట్ సైడ్ ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,340 పిక్సెల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది.
4/7
120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ సపోర్టు ఇస్తుంది. ఈ గెలాక్సీ A27 5జీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉంటాయని అంచనా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12MP ఫ్రంట్ కెమెరాతోపాటు 5,000mAh బ్యాటరీ కూడా ఉండొచ్చు.
5/7
2026 ఫిబ్రవరిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌కు కొనుగోలుదారుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా అనే 3 మోడళ్లు ఉన్నాయి.
6/7
నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ లాంచ్ అయిన మొదటి 6 వారాల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ సేల్స్ గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌తో పోలిస్తే సుమారు 15 శాతం అమ్మకాలు పెరిగాయి. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ అయిన రోజులతో పోలిస్తే శాంసంగ్ మొత్తం స్మార్ట్‌ఫోన్ సేల్స్ సుమారు 5 శాతం పెరిగాయి. అమెరికా, దక్షిణ కొరియాలలో ఫస్ట్ డిమాండ్ ఎక్కువగా ఉంది.
7/7
దాంతో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. అయితే, జపాన్, చైనాలలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌తో పోలిస్తే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కు డిమాండ్ చాలా తక్కువగా ఉంది.