Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అదిరిపోయే వార్త.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ ఇంకా అందుబాటులోనే ఉంది. ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ వంటి అన్నింటిపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లనే ఎక్కువ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. భారీ తగ్గింపు ధరకే పాపులర్ మోడళ్లను ఎంచుకోవచ్చు.
2/6
అందులో శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ ఒకటి. ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ రూ. 16వేలు ధర తగ్గింపుతో లభ్యమవుతుంది. శాంసంగ్ A-సిరీస్ కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం మీ బడ్జెట్ ధరలోనే శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
శాంసంగ్ గెలాక్సీ A55 5G అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ రూ. 39,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు అమెజాన్‌లో రూ. 23,999కు లిస్ట్ అయింది.
4/6
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రూ. 16,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
6/6
కెమెరాల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ట్రిపుల్ రియర్ సెటప్ కలిగి ఉంది. 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.