Noida Twin Towers Demolition: కూల్చివేతకు ముందు నోయిడా ట్విన్ టవర్స్ వద్ద దృశ్యాలు
నోయిడా సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో దేశంలోనే అతి పెద్ద సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టం కానుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 2:45 మధ్యలో ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9600కు పైగా రంద్రాల్లో 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చి ఈ టవర్స్ ను కూల్చివేయనున్నారు. కూల్చివేత ప్రారంభంమైన 12 నుంచి 15 నిమిషాల్లోనే టవర్స్ నేలమట్టం కానున్నాయి. ఇప్పటికే టవర్స్ కు 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి పంపించి వేశారు. సాయంత్రం 5గంటల వరకు అనుమతి నిరాకరించారు.