Yuvina Parthavi : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమాలో.. ఈ నటి ఎవరో తెలుసా?
Aadarsha Kutumbam Yuvina Parthavi: త్రివిక్రమ్ వెంకటేష్ తో ప్రస్తుతం ఆదర్శకుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ కూతురు పాత్రలో నటిస్తున్న యువిన పార్థవి వైరల్ గా మారింది.
- Saketh U
- Updated on- July 29, 2026 / 05:28 PM IST
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమాలో.. ఈ నటి ఎవరో తెలుసా?
త్రివిక్రమ్ వెంకటేష్ తో ప్రస్తుతం ఆదర్శకుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు గ్లింప్స్ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కూతురు పాత్రలో నటిస్తున్న యువిన పార్థవి వైరల్ గా మారింది.
నేడు ఈ సినిమా నుంచి యువిన పార్థవి గ్లింప్స్ రిలీజ్ చేయగా తన క్యూట్ డైలాగ్ తో అందర్నీ ఆకట్టుకుంది.
దీంతో ఆదర్శకుటుంబం సినిమాలో వెంకటేష్ కి కూతురుగా నటిస్తున్న ఈ యువిన పార్థవి ఎవరా అని వెతికేస్తున్నారు జనాలు.
యువిన పార్థవి చెన్నైలో సెటిలైన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి.
యువిన పార్థవి చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక తమిళ్ సినిమల్లో నటించింది.
2013 లో తిరుమతి తమిజ్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది యువిన పార్థవి.
ఆ తర్వాత వీరం, అరణ్మయి, కత్తి, కాకి, పుష్పక విమాన, సర్కార్.. ఇలా దాదాపు 25 తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది యువిన పార్థవి.
కాకి అనే ఓ తెలుగు సినిమాలో కూడా నటించింది యువిన పార్థవి.
ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కూతురు పాత్రల్లో నటిస్తుంది యువిన పార్థవి.
అలా త్రివిక్రమ్ - వెంకటేష్ ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చిన యువిన పార్థవి ఈ సినిమాలో వెంకటేష్ కూతురు పాత్రలో నటిస్తుంది.
త్వరలో ఈమె హీరోయిన్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.
ఇన్నాళ్లు తమిళ్ లో మెప్పించిన యువిన పార్థవి ఆదర్శ కుటుంబం తర్వాత తెలుగులో కూడా ఛాన్సులు అందుకోవడం ఖాయం అంటున్నారు.
Child Artist Yuvina Parthavi Entry Into Venkatesh Trivikram Movie Aadarsha Kutumbam
