Top 5 Tablets : ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్.. రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 టాబ్లెట్స్ ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!

Top 5 Tablets : కొత్త టాబ్లెట్స్ కొనేవారికి గుడ్ న్యూస్.. వన్‌ప్లస్, రెడ్‌మి, రియల్‌మి వంటి టాప్ బ్రాండ్‌లు రూ.15వేల కన్నా తక్కువ ధరలో టాబ్లెట్స్ అందిస్తున్నాయి.

1/6
Top 5 Tablets : కొత్త ట్యాబ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. మరికొద్దిరోజుల్లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ప్రారంభం కానుంది. ఐఫోన్, గూగుల్ పిక్సెల్ ఫోన్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. సేల్‌కు ముందుగానే టాప్ 5 టాబ్లెట్ ఆఫర్‌లను (Flipkart Big Billion Days Sale 2025) కూడా వెల్లడించింది. మీరు రూ. 15వేల కన్నా తక్కువ ధరకు టాబ్లెట్ కొనేందుకు ఇదే బెటర్ టైమ్.. ప్రస్తుతం OnePlus, Redmi, Realme వంటి ప్రముఖ బ్రాండ్‌ టాబ్లెట్స్ లిస్టులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఎంచుకుని కొనేసుకోండి.
2/6
ఒప్పో ప్యాడ్ SE : ఈ టాబ్లెట్ ధర రూ.10,799.00కు కొనుగోలు చేయొచ్చు. మీడియాటెక్ హెలియో G100 ప్రాసెసర్, 10.95-అంగుళాల డిస్‌ప్లే, 5MP ఫ్రంట్, మెయిన్ కెమెరా, 9340mAh బ్యాటరీ ఉన్నాయి. Wi-Fi, LTE కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
3/6
రియల్‌మి ప్యాడ్ 2 LTE : ఈ టాబ్లెట్ ధర రూ.11,999కు పొందవచ్చు. 8MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్, 11.5-అంగుళాల డిస్‌ప్లే, 8360mAh బ్యాటరీ ఉన్నాయి. Wi-Fi, LTE కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
4/6
రెడ్‌మి నోట్ 7 : ఈ టాబ్లెట్ ధర రూ.10,499కు పొందవచ్చ. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 11-అంగుళాల డిస్‌ప్లే, 5MP ఫ్రంట్ కెమెరా, 8MP మెయిన్ కెమెరా, 8000mAh బ్యాటరీ ఉన్నాయి. Wi-Fi కనెక్టివిటీ ఆప్షన్ మాత్రమే కలిగి ఉంది.
5/6
ఇన్ఫినిక్స్ Xప్యాడ్ : ఫ్లిప్‌కార్ట్ డీల్ సమయంలో ఈ టాబ్లెట్ ధర రూ. 10,799.00గా ఉంటుంది. 7000mAh బ్యాటరీ, 11-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో G99 చిప్‌సెట్, 8MP ఫ్రంట్, మెయిన్ కెమెరా ఉన్నాయి. ఈ ట్యాబ్‌ 4G కనెక్టివిటీ ఆప్షన్ కలిగి ఉంది.
6/6
వన్‌ప్లస్ ప్యాడ్ గో : ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ ధర రూ.13,749 ఉంటే.. మీడియాటెక్ హెలియో G99 చిప్‌సెట్, 11.35-అంగుళాల డిస్‌ప్లే, 8MP ఫ్రంట్, ప్రైమరీ కెమెరా, 8000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ట్యాబ్‌కు Wi-Fi, 4G కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.