Telugu » Photo-gallery » Vande Bharat Sleeper To Be Launched In January Ashwini Vaishnaw Announces Route Fares Check Details Ve
గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు షురూ.. రూట్లు, టికెట్ ఛార్జీల వివరాలు ఇవే..
భారతీయ రైల్వే ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు.
వందే భారత్ స్లీపర్ రైలును సుదీర్ఘ మార్గాల్లో, రాత్రి ప్రయాణాలు చేసేవారి కోసం భారతీయ రైల్వే తయారు చేసింది. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్ రైలు. అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వందే భారత్ స్లీపర్ రైలు సెట్లు సిద్ధంగా ఉన్నాయి.
2/9
ప్రయోగ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ రైళ్లు 1200-1500 కిలోమీటర్ల దూరం ఉండే రైలు మార్గాలపై నడవనున్నాయి.
3/9
తొలి వందే భారత్ స్లీపర్ రైలు గువాహటి-కోల్‌కతా మధ్య నడుస్తుందని అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. ప్రతి వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి.
4/9
కోచ్‌ల కూర్పు ఇలా ఉంటుంది: 11 ఎసీ 3 టైర్, 4 ఎసీ 2 టైర్, 1 ఎసీ ఫస్ట్ క్లాస్ కోచ్. ఈ రైలు 823 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుంది. వచ్చే 6 నెలల్లో మరో 8 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు వైష్ణవ్ తెలిపారు. ఏడాది చివరికి మొత్తం రైళ్ల సంఖ్య 12కి చేరనుంది.
5/9
ఈ మార్గాల్లో నడుస్తాయి.. అస్సాం: కామ్రూప్ మెట్రోపాలిటన్, బోంగాయ్‌గావ్.. పశ్చిమ బెంగాల్: కూచ్‌బెహార్, జల్పాయ్‌గురి, మాల్దా, ముర్షిదాబాద్, పూర్బ బర్ధమాన్, హూగ్లీ, హౌరా..
6/9
భారతీయ రైల్వే ప్రకారం గువాహటి–కోల్‌కతా మధ్య ఒక్క దారి ప్రయాణానికి వందే భారత్ స్లీపర్ రైలు చార్జీలు రూ.2,300 నుంచి ప్రారంభమవుతాయి.
7/9
వందే భారత్ స్లీపర్ ఏసీ 3 టైర్ చార్జీ: రూ.2300, వందే భారత్ స్లీపర్ ఏసీ 2 టైర్ చార్జీ: రూ.3000, వందే భారత్ స్లీపర్ ఏసీ ఫస్ట్ చార్జీ: రూ.3600
8/9
కోటా-నాగ్డా మార్గంలో నిర్వహించిన టెస్ట్‌లో వందే భారత్ స్లీపర్ రైలు గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు సాధించింది.
9/9
నీటితో నింపిన గ్లాసులు 180 కిలోమీటర్లు మించిన వేగంలో కూడా చలనం లేకుండా ఉన్నాయి. నీరు ఒక్క చుక్క కూడా కింద పడలేదు.