69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డుని ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో అల్లు అండ్ మెగా వారి ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. ఈక్రమంలోనే మెగాహీరోలు అల్లు అర్జున్ ని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఉప్పెన సినిమాకు కూడా అవార్డు రావడంతో మైత్రీ నిర్మాతలు దర్శకుడు బుచ్చిబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.