Cong to PM: 16 కోట్ల ఉద్యోగాలపై మోదీని నిలదీసిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

దేశంలో నిరుద్యోగంపై, ఉద్యోగాల కల్పనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ.. 16 కోట్ల ఉద్యోగాలపై నిలదీశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల లెక్కన గడిచిన ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, అలాంటిది లక్షలోపు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు.

Cong to PM: శుక్రవారం దేశవ్యాప్తంగా 71,000 మంది నిరుద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అయితే దేశంలో నిరుద్యోగంపై, ఉద్యోగాల కల్పనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ.. 16 కోట్ల ఉద్యోగాలపై నిలదీశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల లెక్కన గడిచిన ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, అలాంటిది లక్షలోపు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ఆ ముగ్గురు సజీవదహనం?

‘‘ప్రభుత్వ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం కేవలం 71 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. వాస్తవానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతోంది. ఈ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ లక్ష ఉద్యోగాలు కూడా సృష్టించలేదు. కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదు. కోట్ల ఉద్యోగాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది’’ అని ఖర్గే అన్నారు.

Delhi Politics: మీ పని మీరు చేయండి, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి.. ఢిల్లీ ఎల్జీతో కేజ్రీవాల్

ట్రెండింగ్ వార్తలు