FM Palanivel Thiagarajan : స్టాలిన్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పీటీఆర్.. ఎంఐటీ గ్రాడ్యుయేట్ నుంచి రాజకీయ నేతగా..

తమిళనాడు రాష్ట్రంలో సీఎంగా స్టాలిన్‌ సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈ కేబినెట్‌లో 33 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని చెన్నై నగరాన్ని మినహాస్తే మిగిలినవారంతా 22 జిల్లాల నుంచి ప్రాతినథ్యం వహిస్తున్నారు.

FM Palanivel Thiagarajan : తమిళనాడు రాష్ట్రంలో సీఎంగా స్టాలిన్‌ సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈ కేబినెట్‌లో 33 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని చెన్నై నగరాన్ని మినహాస్తే మిగిలినవారంతా 22 జిల్లాల నుంచి ప్రాతినథ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరైన మదురై నుంచి పీటీఆర్‌- పళనివేల్‌ త్యాగరాజన్‌‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రిగా సీఎం స్టాలిన్ ఎంచుకున్నారు. ఈయన అమెరికాలో ఉన్నత చదువులు చదివారు.. భారత్ లోనూ, అమెరికాలోనూ టాప్ ఇన్సిస్ట్యూట్లలో డిగ్రీలు పొందారు.. అంతేకాదు.. ఎంఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన త్యాగరాజన్‌‌ మాజీ బ్యాంకు అధికారి కూడా. ఇప్పుడు మదురై సెంట్రల్ నుంచి రెండోసారి 34,176 ఓట్ల తేడాతో విజయం సాధించి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

విదేశాలలో కొన్నాళ్లపాటు నివసించిన త్యాగరాజన్ అక్కడే తన క్లాస్ మెంట్ అయిన మార్గరెట్ రాజన్ ను వివాహం చేసుకున్నారు. అనంతరం తమిళనాడులో రాజకీయాల్లో ప్రజాదరణ పొందిన ఎమ్మెల్యేగా మారారు. పళనివెల్ త్యాగరాజన్ లేదా పిటిఆర్‌గానే ఆయన అందరికి సుపరిచితులు.. ఇప్పుడు తన 55ఏళ్ల జీవితంలో ఊహించని మలుపు తిరిగింది.. మధురై నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. పీటీఆర్ చదివిన ఉన్నత డిగ్రీలే ఇప్పుడు ఆయన్ను ఆర్థిక మంత్రి అయ్యేందుకు దోహదపడ్డాయి. ఎన్ఐటి ట్రిచీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీలో ఉన్నత అధ్యయనాలు, ఎంఐటిలోని స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ డిగ్రీలు పొందిన పీటీఆర్ కు సీఎం స్టాలిన్ తన మంత్రివర్గంలో ఫైనాన్స్ మంత్రిగా అవకాశం కల్పించారు.

పిటిఆర్‌ తాత పిటి రాజన్ 1930లలో మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి పిటిఆర్ పళనివెల్ రాజన్ డిఎంకెలో మంత్రిగా పనిచేశారు. మదురై సెంట్రల్ నుంచి రెండోసారి 34,176 ఓట్ల తేడాతో విజయం సాధించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్ళలో, పిటిఆర్ నేతగా తన నియోజవర్గ ప్రజలతో మమేకమయ్యారు. తన నియోజకవర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారు. ప్రతి ఆరునెలలకోసారి తన పనితీరుకు సంబంధించి నివేదిక ఉంచుతారు.

పిటిఆర్ నాయకత్వ పటిమ గురించి స్టాలిన్ కు తెలుసు.. అందుకే ఆయనకు ఎంతో కీలకమైన ఆర్థిక శాఖను పిటిఆర్ కు అప్పగించారు. 1987లో అమెరికాకు వెళ్లిన పిటిఆర్ 20 ఏళ్ల తరువాత తిరిగి వచ్చారు. చదువు పూర్తి చేసి అక్కడే ఉద్యోగంలో చేరారు. అమెరికన్ క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకున్నారు. నాలుగు ఏళ్ల తరువాత, 2011లో పిటిఆర్ ఉన్నత స్థాయి బ్యాంకర్ ఉద్యోగం కోసం సింగపూర్ వెళ్లారు. 2015లో తిరిగి స్వదేశానికి వచ్చారు. ఏడాది తరువాత, మదురై సెంట్రల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు తన  భార్య మార్గరెట్, ఇద్దరు కుమారులు పళని థియాగా రాజన్, వెల్ థియాగా రాజన్ కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు