Actor Prudhvi Raj Election Campaign
Actor Prudhvi Raj : సినీ నటుడు పృథ్వీరాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. టీడీపీ-జనసేన కూటమి తరపున చేపట్టాల్సిన ప్రచారంపై చర్చించారు. శ్యాంబాబు క్యారెక్టర్ లోనే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టనున్నారు పృథ్వీ. బ్రో సినిమాలో ఓ వైసీపీ నేతకు పేరడీ పాత్ర పోషించారు పృథ్వీ. అందులో శ్యాంబాబు క్యారెక్టర్ లో కనిపించారు. ఆ క్యారెక్టర్ బాగా సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే.
Also Read : వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?
రాష్ట్ర వ్యాప్తంగా శ్యాంబాబు క్యారెక్టర్ వేషధారణతో పర్యటిస్తానని నటుడు పృథ్వీ తెలిపారు. శ్యాంబాబు వేషధారణతోనే టీడీపీ-జనసేన తరపున ప్రచారం చేస్తానన్నారు. అందరూ కోరుకుంటే సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు వేషధారణతో ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిందన్నారాయన.
తాను ఏ టిక్కెట్ ఆశించడం లేదని, ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన దగ్గర లేదని నటుడు పృథ్వీ అన్నారు. తాను ఏ పదవీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాగా, దూషణలు లేని ప్రచారం చేస్తామని పృథ్వీ తెలిపారు. సినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీ తరపున ఉన్నా.. ఎవరి ప్రచారం వారిదే అన్నారు నటుడు పృథ్వీ.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?