Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నిక వేళ రసవత్తరంగా మారిన రాజకీయ పరిణామాలు

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఆర్వోగా పని చేసిన జగన్నాథ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. సహాయ రిటర్నింగ్ అధికారిగా ఉన్న చౌటుప్పల్ ఎమ్మార్వోపై సస్పెన్షన్ వేటు వేశారు. నేడు మునుగోడుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రానున్నారు.

Congress Candidate Munugodu By-Poll

Munugode bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఆర్వోగా పని చేసిన జగన్నాథ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. సహాయ రిటర్నింగ్ అధికారిగా ఉన్న చౌటుప్పల్ ఎమ్మార్వోపై సస్పెన్షన్ వేటు వేశారు. నేడు మునుగోడుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రానున్నారు.

చండూరు ఆర్వో కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఎన్నికల నిర్వహణ తీరు గందరగోళంగా మారింది. ఆపరేషన్ ఆకర్ష్ కు గులాబీ పార్టీ పదును పెట్టింది. బూర నర్సయ్య గౌడ్ పార్టీ వీడిన తర్వాత టీఆర్ఎస్ అలెర్ట్ అయింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి రవి దంపతులు, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గులాబీ కండువా కప్పుకున్నారు. మరింత మంది టచ్ లో ఉన్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

టీఆర్ఎస్ ను ఎన్నిక గుర్తులు కూడా టెన్షన్ పెడుతున్నాయి. మొదటి ఈవీఎంలోనే కారును పోలిన 4 గుర్తులు ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కాంగ్రెస్ లోకలకలం సృషిస్తోంది. తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించాలంటూ కాంగ్రెస్ నేతలకు వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు. ఆడియో లీక్ కావడంతో.. అది 2018 ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంకట్ రెడ్డి.

ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఎంపీ వెంకట్ రెడ్డి మద్దతు తెలపలేదు. ఎన్నికల వరకు అందుబాటులో ఉండకుండా కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఉప ఎన్నిక సమయంలో నేతలు పార్టీ వీడుతుండడంతో కమలనాథుల్లోనూ టెన్షన్ నెకొంది. ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం లోకి కీలక నేతలు దిగుతున్నారు. టీఆర్ఎస్ లో కేటీఆర్ రోడ్ షో జోష్ నింపింది. క్యాడర్ లో బండి సంజయ్ రోడ్ షోలు ఉత్సాహం నింపుతున్నాయి. కాంగ్రెస్ ప్రచారానికి సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..