ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దగ్గుబాటి చేరిక తర్వాత ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెంచిన జగన్.. ఇప్పుడు చీరాల ఎమ్మెల్యేను లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో చేరిన ఆమంచి.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కొన్ని నెలలుగా టీడీపీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆమంచి దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు విజయసాయిరెడ్డి, దగ్గరబాటిలు ఆమంచితో మంతనాలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమంచి టీడీపీని వీడే అవకాశం ఉందన్న వార్తలతో ఆ పార్టీ అలర్ట్ అయ్యింది. ఆమంచిని బుజ్జగించే బాధ్యతను కరణం బలరాంను రంగంలోకి దింపింది టీడీపీ.
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారకుండా ఉండేందుకు ఎమ్మెల్సీ కరణం బలరాం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవసరమైతే ఆమంచికి మంత్రి పదవి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని సమాచారం. ఆమంచి పార్టీ మారకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుంటే టీడీపీలో ఉండలేం అని ఆమంచి ఆనుచరులు, కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, అనుచరులతో ఆమంచి సమావేశం నిర్వహించి అభిప్రాయం కూడా తీసుకున్నారు. పార్టీ మారే విషయంపై కార్యకర్తలతో చర్చించారు. వారి అభిప్రాయం, సూచనల మేరకు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. చీరాల ఎమ్మెల్యే పార్టీ మార్పు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. చర్చనీయాంశం అయ్యింది.