విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్‌సిగ్నల్ : సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం

  • Publish Date - February 27, 2019 / 02:16 PM IST

ఢిల్లీ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ రైల్వే జోన్ కల సాకారమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సౌత్ కోస్ట్ రైల్వే గా నామకరణం చేశారు.
Also Read: సర్జికల్ స్ట్రయిక్స్ – 2.0 స్పెషల్ స్టోరీస్

ఈ మేరకు ఆయన ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి 27) మీడియాతో అనౌన్స్ చేశారు. గుంటూరు, విజయవాడ, గుంతకల్, వాల్తేరులోని ఒక భాగంతో కలిపి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వాల్తేరు డివిజన్ ను రాయఘడ్ కేంద్రంగా మార్చబోతున్నట్లు చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ కోసం ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. విభజన చట్టంలో కూడా రైల్వే జోన్ ఏర్పాటును ప్రస్తావించారు. వాల్తేరు డివిజన్ ను విభజించారు. వాల్తేరులోని ఒక భాగాన్ని విజయవాడ డివిజన్ లో విలీనం చేశారు. మరో భాగాన్ని రాయఘడ్ కేంద్రంగా ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేశారు.