బాబు రైతు పేరెత్తగానే కన్నబాబుకు చిర్రెత్తుకొచ్చింది

  • Publish Date - July 9, 2020 / 07:28 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా పంటలను కొనుగోలు చేశారా అని నిలదీశారు. రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలను అలవోకగా మాట్లాడుతున్నారని చెప్పారు. గత పాలనలో రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ మర్చిపోలేరన్నారు.

రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చంద్రబాబు చెల్లించలేదని విమర్శించారు. చంద్రబాబు పెట్టిన 14,832 కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు బ్రహ్మాండంగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. వాడవాడలో రాజశేఖర్ రెడ్డిని రైతు బాంధవుడిగా కీర్తిస్తున్నారని పేర్కొన్నారు.

అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డును తెచ్చామని తెలిపారు. విప్లవాత్మక మార్పులు తెస్తూ హరిత విప్లవాన్ని సాధిస్తున్నామని చెప్పారు. 2800 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. రికార్డు స్థాయిలో 8.5 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేశామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు.

మొక్క జొన్న మార్కెట్ లో 1200 నుంచి 1300 ధర ఉంటే 1750 రూపాయలకు చేసి కొన్నామని చెప్పారు. జొన్న మార్కెట్ లో 1500 ధర ఉంటే ఎమ్ ఎస్ పీ 2550 రూపాయలకు కొనుగోలు చేశామని చెప్పారు. ఇవ్వన్నీ చంద్రబాబుకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు