YCP Fifth List
YCP Fifth List : అధికార పార్టీ వైసీపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన 5వ జాబితా ఎట్టకేలకు వచ్చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ 5వ లిస్ట్ ను విడుదల చేశారు. పలు మార్పులు చేర్పులు చేసింది వైసీపీ అధినాయకత్వం. 5వ లిస్టులో 4 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించారు.
ఎంపీ అభ్యర్థులు..
కాకినాడ.. చలమలశెట్టి సునీల్
మచిలీపట్నం.. సింహాద్రి రమేష్ బాబు
నరసరావుపేట.. అనిల్ కుమార్ యాదవ్
తిరుపతి(ఎస్సీ).. గురుమూర్తి
అసెంబ్లీ అభ్యర్థులు
అరకు.. రేగం మత్స్యలింగం
అవనిగడ్డ.. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు
సత్యవేడు… నూకతోటి రాజేశ్
స్వల్ప మార్పులతో 5వ జాబితాను ప్రకటించింది వైసీపీ అధినాయకత్వం. ఇప్పటివరకు నాలుగు జాబితాలు విడుదల చేసింది. 58 అసెంబ్లీ, 10 లోక్ సభ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. తాజాగా 4 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో.. అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేశ్ ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అనౌన్స్ చేసింది. అలాగే ప్రముఖ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును(అంకాలజిస్ట్, క్యాన్సర్ వైద్య నిపుణులు), సింహాద్రి రమేశ్ కు స్వయాన సోదరుడు.. సింహాద్రి చంద్రశేఖర్ ను అవనిగడ్డ అసెంబ్లీ ఇంఛార్జిగా ప్రకటించారు జగన్.
Also Read : ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..! కారణం అదేనా? జగన్ వ్యూహం ఏంటి?
నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ హైకమాండ్. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తికే అవకాశం దక్కింది. గతంలో గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం ఎదురు తిరిగిన నేపథ్యంలో తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ గురుమూర్తి పేరునే ఖరారు చేసింది వైసీపీ అధినాయకత్వం. ఇక, గతంలో అరకు ఇంఛార్జ్ గా గొడ్డేటి మాధవిని ప్రకటించగా.. తాజాగా మాధవి స్థానంలో రేగం మత్స్యలింగంని అభ్యర్థిగా అనౌన్స్ చేసింది వైసీపీ హైకమాండ్.
YCP Fifth List