×
Ad

రాజధాని గ్రామాల్లో డిసెంబర్19, గురువారం బంద్

  • Publish Date - December 18, 2019 / 02:43 PM IST

ఏపీ రాజధానిపై సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వెలువడ్డాయి. టీడీపీ. జనసేన పార్టీలు తీవ్ర స్ధాయిలో మండి పడ్డాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత  ఏర్పడింది.  దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిధ్ధమవుతున్నారు.  

మూడు రాజధానుల ఫ్రకటనను వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేస్తూ గురువారం రాజధాని గ్రామాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ లో రాజధానికి చెందిన 29 గ్రామాల ప్రజలు పాల్గోనాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాజధాని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శిలాఫలకం వేసిన చోట రైతులు ఆందోళనకు దిగారు.

రాజకీయాలకోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దని వారు కోరుతున్నారు. గురువారం నుంచి వెలగపూడిలోని  సెక్రటేరియట్ ముందు  నిరాహర దీక్ష చేపట్టాలని , శుక్రవారం నుంచి 29 గ్రామాల్లోని సచివాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేయాలని రైతులు నిర్ణయించారు.