ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ బదిలీ:  సిసోడియా స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేది

  • Publish Date - January 17, 2019 / 12:24 PM IST

అమరావతి: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోడియాను బదిలీచేస్తూ ఆయన స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఎన్నికల ప్రధానఅధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది. గోపాలకృష్ణ ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.