సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత గవర్నర్ దగ్గరికి ఈసీ రమేష్ కుమార్

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్‌కు

  • Publish Date - March 15, 2020 / 11:08 AM IST

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్‌కు

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్‌కు వివరించనున్నారు. ఇప్పటికే సిబ్బందితో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ భేటీ అయ్యారు. గవర్నర్‌కు ఇచ్చే నివేదిక అంశంపై అధికారులతో చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, ఈసీపై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కోసమే ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈసీ రమేష్ కుమార్ చంద్రబాబు నియమించిన వ్యక్తి అని, వారిద్దరి సామాజికవర్గం ఒక్కటే అని, చంద్రబాబుకి అనుకూలంగా ఈసీ వ్యవహరించారని జగన్ ఆరోపణలు చేశారు.

ఎన్నికలు వాయిదా వేయడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సీఎం జగన్, ఈసీ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఈసీ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని, వివక్ష చూపించారని జగన్ ఆరోపించారు. ఎన్నికలను వాయిదా వేసే అధికారం, అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. ఇక సీఎంగా నేనెందుకు? రాష్ట్రాన్ని మీరే పాలించండి అంటూ ఈసీపై మండిపడ్డారు జగన్.