తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే., అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తామని ప్రకటన చేసిన బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారు. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రగల్బాలు పలికిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు చేసే సమయానికి బీజేపీ అభ్యర్థులు చేతులేత్తేశారు. నామినేషన్ల దాఖలుకు 2020, జనవరి 10వ తేదీ శుక్రవారంతో గడువు ముగిసిపోయింది.
ప్రస్తుతం బీజేపీకి దాదాపు 30 శాతం అభ్యర్థులు కరవుయ్యారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు. ఇబ్రహింపట్నం లాంటి నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి అభ్యర్థులు లేరా అంటూ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ క్లస్టర్ ఇంఛార్జీలపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఇప్పటికే బీజేపీ అధినేత అమిత్ షా దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు కసరత్తు కూడా చేసింది. కానీ అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. 30 శాతం అభ్యర్థులను నిలబెట్టలేదని తెలుస్తోంది.
2020, జనవరి 11వ తేదీ శనివారం ఓ సమీక్ష సమావేశం నిర్వహించింది బీజేపీ పార్టీ. సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు ? ఎవరెవరు నిలబడ్డారనే దానిపై ఆరా తీశారు. విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. కనీసస్థానాల్లో పోటీ చేయలేని స్థితి నెలకొందని నేతల దృష్టికి వచ్చింది.
ఇబ్రహీంపట్నంలో 24 వార్డులుంటే..కేవలం 6 వార్డుల్లో బీజేపీ పోటీకి దిగినట్లు తెలిసి వచ్చింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 4 లేదా 5 స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని గ్రహించారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కొవాలనే దానిపై బీజేపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. అభ్యర్థులు లేని వార్డులు, నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తుందా ? వీరికి బీ ఫారాలు ఇస్తుందా అనేది చూడాలి.
Read More : ఎడ్ల పందాల్లో పాల్గొన్న కొడాలి నాని..జనసేన ఎమ్మెల్యే..సంచలన వ్యాఖ్యలు