BJP Lok Sabha Candidates : 7 రాష్ట్రాలు, 120మంది అభ్యర్థులు.. తుది దశకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా!

రాష్ట్రాల నుంచి వచ్చిన ఆశాశహుల జాబితా నుంచి గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనుంది హైకమాండ్.

BJP Lok Sabha Candidates : లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం మొదలు పెట్టింది. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. దాదాపు 7 రాష్ట్రాల్లో పోటీ చేసే 120 మంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదిరిన సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వీరితో పాటు మరికొన్ని సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల నుంచి వచ్చిన ఆశాశహుల జాబితా నుంచి గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనుంది హైకమాండ్. కేంద్ర ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు సమావేశానికి అందుబాటులో ఉండాలని ఆయా రాష్ట్రాల నేతలకు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

Also Read : కాపు నేతలు హర్ట్ అయ్యారా? పవన్ కల్యాణ్‌తో కటీఫేనా?

 

ట్రెండింగ్ వార్తలు