ఏపీలో పాలన గాలికి వదిలేసి టీడీపీ డ్రామాలు చేస్తోందని బీజేపీ నాయకులు జీవీఎల్ అన్నారు.
గుంటూరు : ఏపీలో పాలన గాలికి వదిలేసి టీడీపీ డ్రామాలు చేస్తోందని బీజేపీ నాయకులు జీవీఎల్ అన్నారు. గత ఏడెనిమిది నెలలుగా డ్రామాలు చేస్తోన్న చంద్రబాబు గిన్నిస్ రికార్డు ఎక్కే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్ ఫ్లైట్ లు అని, దొంగ దీక్షలు అనే పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు.
గుంటూరులో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబు దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. టీడీపీ ప్రజల్లో పూర్తిగా క్షీణించిపోయిందని భావించి రాజకీయ కోసం తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో వాస్తవాలు లేవని చంద్రబాబుకు తెలుసు, ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపాలరని.. వీరి సినిమా కచ్చితంగా ప్లాప్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఎంత ప్రయత్నించినా ప్రజాదుర్వినియోగం తప్ప లాభించేంది ఏది లేదన్నారు.
ఈడీ, సీబీఐ తనపైకి వస్తుందేమోనని చంద్రబాబు రోజూ భయపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సరిగ్గా నిద్రపోయి ఎన్నిరోజులైందోనని అన్నారు. మమతా బెనర్జీ భంగపాటు అయ్యాక చంద్రబాబు మరింత ప్యానిక్ అయ్యారని పేర్కొన్నారు. తప్పు చేసినవాడే భయపడుతాడని…తమ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా ప్రతిఘటిస్తామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని ఆయన అభివృద్ధిగా చెబుతున్నారని విమర్శించారు. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం సంస్థలను తాము తెచ్చామని చెప్పారు. సగం పనులు చంద్రబాబు అడ్డుకోవడం వల్లే జరుగలేదన్నారు. చంద్రబాబు ఏవో అబద్ధాలు చెప్పి మెట్రో కెమికల్ కంపెనీ రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు.