Madhavi Latha : హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం- మాధవీలత

చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఊరుకునేది లేదని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని హెచ్చరించారు.

Madhavi Latha : తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాధవీలత. తాను చేసిన సేవా కార్యక్రమాల వల్లే తనకు టికెట్ వచ్చేలా చేసిందన్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. తాను జనసంఘ్ నుంచి వచ్చానని, తాను పార్టీలో లేను అనే విమర్శలను పట్టించుకోను అని చెప్పారు. సొంత ఇంటి వారు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరం కాదని, త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయన్నారు.

తాను హైదరాబాద్ వస్తున్నానని, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఊరుకునేది లేదని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని హెచ్చరించారు. హైదరాబాద్ పార్లమెంటులో ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాధవిలత. హైదరాబాద్ లో ఈసారి మార్పు తధ్యమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు.

Also Read : విస్తృత ప్రచారం, అభివృద్ధి పనులకు శ్రీకారం.. లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్న బీజేపీ

 

ట్రెండింగ్ వార్తలు