జనసేనతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉంది. దేశంలో జెండా ఎత్తేసింది. ఏపీలో కనుచూపు మేర లో కాంగ్రెస్ లేదు.

GVL Narasimha Rao Key Comments On Janasena Alliance

GVL Narasimha Rao : ఏపీలో పొత్తుల వ్యవహారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై అంతిమ నిర్ణయం జాతీయ నాయకులు తీసుకుంటారని ఆయన చెప్పారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు జీవీఎల్. ఇక, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని జీవీఎల్ తేల్చి చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పైనా జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.

”బడ్జెట్ లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు. ఇది దేశ బడ్జెట్. రాష్ట్రాలకు గత బడ్జెట్ లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా కేటాయించారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారు. కచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదు. చట్టంలో ఉన్న అంశాలన్నీ కేంద్రం నెరవేరుస్తుంది. ఏపీ, తెలంగాణలో బీజేపీ ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే అధిక లాభాలు కేంద్రం నుంచి వస్తాయి. వడ్డించే వారు మన వాళ్లు అయితే మనకి చేకూరే లాభం ఎక్కువగా ఉంటుంది.

Also Read : 3 సార్లు ఓడినా నాల్గోసారి పట్టువదలని విక్రమార్కుడిలా.. పోటీలోకి చలమలశెట్టి సునీల్.. పూర్తి వివరాలు..

రైల్వే జోన్ అంశం బీజేపీ పూర్తి చేస్తుంది. రైల్వే జోన్ కి ఏపీ ప్రభుత్వం భూమిని ఇవ్వలేదు. కేంద్రం అనుమతించినవి అన్నీ కేంద్రం నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉంది. దేశంలో జెండా ఎత్తేసింది. ఏపీలో కనుచూపు మేర లో కాంగ్రెస్ లేదు. రాష్ట్రానికి నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్లనే. రాజకీయ ఉద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఏపీలో కాంగ్రెస్ లేదు” అని జీవీఎల్ అన్నారు.

Also Read : సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ స్పెష‌ల్ ఫోక‌స్‌.. అభ్య‌ర్థుల ఖ‌రారుపై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు