Amit Malviya: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నేత ఆరోపణలు

ఈ ఎన్నికలో మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‭కి 1,072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఇంత వ్యాత్యాసంతో ఓట్లు చీలిన అతి తక్కువ సందర్భాల్లో ఇది ఒకటి. ఒక్క 1997లో శరద్ పవార్ (882), రాజేశ్ పైలట్ (354)లపై సీతారాం కేసరి (6,224) ఎక్కువ ఓట్లతో గెలిచారు. ఇక 2000లో జరిగిన ఎన్నికల్లో అయితే సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా, జితేంద్ర ప్రసాదకు కేవలం 94 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Amit Malviya: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందని భారతీయ జనతా పార్టీ నేత అమిత్ మాల్వియా ఆరోపణలు గుప్పించారు. శశి థరూర్ శక్తిసామర్థ్యాలను పరిగణలోకి తీసుకోకుండా, ఎన్నికను పక్షపాతంతో నిర్వహించారని ఆయన అన్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలో లోటుపాట్లపౌ ఇప్పటికే శశి థరూర్ కొంత అసంతృప్తి, కొంత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికపై బీజేపీ నేత ఆరోపణలు చేయడం గమనార్హం.

ఈ విషయమై అమిత్ మాల్వియా గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలో మల్లికార్జున ఖర్గేకు 88 శాతం ఓట్లు వచ్చాయి. రెండు శాతం తక్కువ 90 శాతం ఇది. ఈ నంబర్ చూస్తే అర్థం అవుతోంది. ఆ ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందని కచ్చితంగా చెప్పడానికి. ఈ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన శశి థరూర్‭కు ఇది అధికారికంగా ఒక మంచి అవకాశం దొరికినట్టైంది. నిజానికి ఈ ఎన్నికలో శశి థరూర్ శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదు’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఈ ఎన్నికలో మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‭కి 1,072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఇంత వ్యాత్యాసంతో ఓట్లు చీలిన అతి తక్కువ సందర్భాల్లో ఇది ఒకటి. ఒక్క 1997లో శరద్ పవార్ (882), రాజేశ్ పైలట్ (354)లపై సీతారాం కేసరి (6,224) ఎక్కువ ఓట్లతో గెలిచారు. ఇక 2000లో జరిగిన ఎన్నికల్లో అయితే సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా, జితేంద్ర ప్రసాదకు కేవలం 94 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Madhya pradeshs Mowgli : రియల్ ‘మెగ్లీ’ ఇంట్రెస్టింగ్ స్టోరీ.. టవల్, చెడ్డీతోనే కాలేజీకొస్తున్న బీఏ సెకండ్ ఇయర్ విద్యార్ధి ..

ట్రెండింగ్ వార్తలు