Madhya pradeshs Mowgli : రియల్ ‘మోగ్లీ’ ఇంట్రెస్టింగ్ స్టోరీ.. టవల్, చెడ్డీతోనే కాలేజీకొస్తున్న బీఏ సెకండ్ ఇయర్ విద్యార్ధి ..

కేవలం టవల్,అండర్ వేర్ మాత్రమే ధరించి కాలేజీకి వచ్చే యువకుడు జంగిల్ బుక్ లో మోగ్లీని తలపిస్తున్నాడు. తనకు ఇష్టమైన చెడ్డీ, తువ్వాలు కాకుండా ప్యాంటు షర్టు వేసుకోవాల్సి వస్తుందని చదువే మానేద్దామనుకున్న్ ఈ రియల్ మోగ్లీ సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు.

Madhya pradeshs Mowgli  : రియల్ ‘మోగ్లీ’ ఇంట్రెస్టింగ్ స్టోరీ.. టవల్, చెడ్డీతోనే కాలేజీకొస్తున్న బీఏ సెకండ్ ఇయర్ విద్యార్ధి ..

madhya pradeshs mowgli

Madhya pradeshs mowgli : ఆ అబ్బాయి పేరు కన్హయ్య అవాసీ. వయస్సు 18 ఏళ్లు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఎందుకంటే కాలేజీకి వచ్చే అబ్బాయిలు ప్యాంటు, షర్టు ధరించి వస్తారు. కానీ కన్హయ్య మాత్రం కేవలం ఓ టవర్..చెడ్డీ మాత్రమే ధరించి కాలేజీకి వస్తాడు.‘జంగిల్‌ బుక్‌’ లో మోగ్లీని గుర్తుకు తెస్తాడు తన డ్రెస్సింగ్ తో. మరి కాలేజీ యాజమాన్యం ఏమీ అనదా? అంటే ఎటువంటి అభ్యంతరం లేదు. కాలేజీలకు యూనిఫాంలు ఉంటాయి.లేదా ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. (ఫార్మల్స్ వంటివి ధరించాలని వంటివి) కానీ కన్హయ్య కేవలం చెడ్డీ, టవల్ ధరించి వస్తే ఎందుకు కాలేసీ సిబ్బంది ఎందుకు అనుమతిస్తోంది అనే డౌట్ వస్తుంది. అసలు ఈ రోజుల్లో చెడ్డీ టవల్ ధరించి కాలేజీకి రావటమేంటి? ఎందుకు ఆ అబ్బాయి అందరిలా బట్టలు వేసుకోడు అంటే..చదువైనా మానేస్తాను గానీ..అందరిలా ప్యాంటు షర్టు మాత్రం వేసుకోనే వేసుకోనంటాడా కన్హయ్య అవాసీ..ఈ వింత విద్యార్ధి గురించి విశేషాలు చాలానే ఉన్నాయి..

65 ఏళ్లుగా స్నానం చేయని ‘మురికి‘ వీరుడు

మధ్యప్రదేశ్‌లోని బర్వానీకి చెందిన పిచోరి గ్రామానికి చెందిన18 ఏళ్ల కన్హయ్య అవాసీకి అచ్చంగా ‘మోగ్లీ’ మాదిరి బట్టలు ధరించడం అస్సలు ఇష్టముండదట. అలా స్కూల్..హైస్కూళ్లకు కూడా అలాగే వెళ్లాడు. స్కూళ్లలో యూనీఫాం ధరించకుండా ఓ చెడ్డీ, టవల్‌ మత్రమే ధరించి రోజూ స్కూల్ కు వెళ్తూ ఉండేవాడు. అలా ఇంటర్‌ వరకు చదువుకున్నాడు..మరి కాలేజీలో ఊరుకోరుగా అలా వస్తే..అందుకే తన డ్రెస్ కోడ్ మార్చుకోవాల్సి వస్తుందని చదువుల్లో మంచి ప్రతిభ ఉన్నా చదువు మానేయటానికి సిద్దపడ్డాడు. కానీ చక్కగా చదువుతు..అన్నింటి తానే ఫస్టుగా ఉండే కన్హయ్య చదువు మానేయటం ఇష్టంలేదని ఉపాధ్యాయులు అంగీకరించలేదు. నీలాంటివాడు ఉన్నత చదువులు చదవాలని ఒప్పించారు. కానీ తన డ్రెస్ కోడ్ విషయంలో మాత్రం కన్హయ్య రాజీపడలేదు. దీనికోసం ఏకంగా కలెక్టర్ వద్దకే వెళ్లి మరీ తనకు ఇష్టమైన బట్టలు (చెడ్డీ, టవల్)ధరించే కాలేజీకి వచ్చేలా అనుమతి తీసుకున్నాడు.

కానీ కాలేజీకి వస్తే బట్టలు ధరించి రావాల్సిందేనని యాజమాన్యం హుకుం జారీ చేసింది. చేసేదిలేక చదువు మానేయాలనుకున్నాడు కన్హయ్య యువకుడు. చివరకు కలెక్టర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే కాలేజీలోకి ఎంట్రీ లభించింది. ప్రస్తుతం కన్హయ్య బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీకి తప్పనిసరిగా దుస్తులు ధరించి వెళ్లవల్సి వస్తుందేమోనని, పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని కన్నయ్య చెప్పటింతో ఉపాధ్యాయులు చాలా శ్రమపడి కళాశాలలో చేర్పించారు.

65 ఏళ్లుగా స్నానం చేయని ‘మురికి‘ వీరుడు

పేద కుటుంబానికి చెందిన కన్హయ్యను ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం అతని వస్త్రధారణే. డిగ్రీలోకి వచ్చినా ఇప్పటికీ అండర్‌వేర్‌, టవల్‌ తప్ప శరీరంపై ఇంకేమీ ధరించడు.ధరించటానికి ఇష్టపడడు. ఇక్కడ కన్హయ్య కుటుంబం గురించి తెలుసుకోవాలి. కన్హయ్య తల్లిదండ్రులు కూడా అందరిలా దుస్తులు ధరించరు. ఐతే అతని సోదరుడు మాత్రం అందిలాగానే బట్టలు ధరిస్తాడు. కన్హయ్య చదివే కాలేజ్‌ ఇన్‌ఛార్జ్‌ మధుసూదన్ చౌబే మాట్లాడుతూ.. ‘కన్హయ్య హ్యాండ్‌ రైటింగ్‌ చాలా బాగుందని..కన్హయ్య చేతిరాత మాత్రమేకాదు చదువులో చక్కటి మార్కులు తెచ్చుకుంటాడని తెలిపారు. కన్హయ్య సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా తక్కువ మాట్లాడుతాడని..వివిధ రకాల క్రీడలపై ఆసక్తి ఉందని తెలిపారు.