Man Not Bathe For 22 years : 22 ఏళ్లుగా స్నానం చేయని 62 ఏళ్ల వ్యక్తి ప్రతిజ్ఞ….కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే

బీహార్ కు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్లుగా స్నానం చేయకుండా ఉన్నాడు. కారణం వింటే మాత్రం హ్యాట్సాఫ్ అంటాం. సమాజం పట్ల ఓ వృద్ధుడు ఎంతగా తపన పడుతున్నాడో కదా అనుకుంటాం...

Man Not Bathe For 22 years : 22 ఏళ్లుగా స్నానం చేయని 62 ఏళ్ల వ్యక్తి ప్రతిజ్ఞ….కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే

Bihar Man Did Not Bathe For 22 Years

man did not bathe for 22 years  :  67 ఏళ్లుగా స్నానం చేయకుండానే ఎంతో ఆరోగ్యంగా ఉ ఇరాన్‌ కు చెందిన 87 ఏళ్ల అమౌ హజీ అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ బీహార్ కు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్లుగా స్నానం చేయకుండా ఉన్నాడు. దానికి అతను చెప్పిన కారణం వింటే మాత్రం హ్యాట్సాఫ్ అంటాం. సమాజం పట్ల ఓ వృద్ధుడు ఎంతగా తపన పడుతున్నాడో కదా అనుకుంటాం…

అతని పేరు ధరమ్​దేవ్ రామ్. వయస్సు 67 ఏళ్లు. బిహార్ లోని పాల్​గంజ్ జిల్లాలోని బైకుంఠపుర్​కు చెందినవాడు. ధరమ్ దేవ్ 2000 సంవత్సరం నుంచి స్నానం చేయకుండా ఉంటుంన్నారు. ఒక్కసారి అంటే ఒక్కసారికూడా స్నానం చేయలేదు. ఒక్కరోజు స్నానం చేయకపోతేనే చిరాగ్గా ఉంటుంది. పైగా చెమట కంపు కొడుతుంటుంది. కానీ 22 ఏళ్లుగా స్నానం చేయకపోయినా ధరమ్ దేవ్ శరీరం నుంచి దుర్వాసన లేదు. ఎప్పుడూ అనారోగ్యబారిన కూడా పడలేదు. చక్కటి ఆరోగ్యంతో ఉన్నాడు.

Also read : 65 ఏళ్లుగా స్నానం చేయని ‘మురికి‘ వీరుడు

22 ఏళ్ల క్రితం ధరమ్ దేవ్ కు 40 ఏళ్ల వయసు ఉండగా..మహిళలపై నేరాలు, భూ వివాదాలు, జంతు వధలు అరికట్టే వరకు స్నానం చేయనని శబధం చేశాడు. అలా అప్పటినుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఆయన బంధువులు ఎవరు చనిపోయినా స్నానం మాత్రం చేయలేదు. అతని ప్రతిజ్ఞకు కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. ఆఖరికి 2003లో ధరమ్ దేవ్ భార్య మాయాదేవి చనిపోయినప్పుడు కూడా స్నానం చేయలేదు. అంతేకాదు ధరమ్ దేవ్ ఇద్దరు అబ్బాయిలు చనిపోయిన తర్వాత కూడా వారి శరీరాలపై చుక్క నీరు పోయలేదు..తను కూడా స్నానం చేయలేదు. అతని గురించి తెలిసిన ఆయన బంధువులు..స్థానికులు అతని సంకల్పాన్ని ప్రోత్సహిస్తారే తప్ప ఎప్పుడు ఒక్కమాటకూడా అనరు. ఆశ్చర్యకరంగా.. ధరమ్‌దేవ్‌కు ఎప్పుడూ అనారోగ్యానికి గురికాలేదు.

ధరమ్​దేవ్ రామ్ 1975లో బెంగాల్ లోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసేవాడు.1978లో వివాహం జరిగింది. 1987లో భూ తగాదాలు, జంతు వధలు, మహిళలపై నేరాలు పెరగడం గురించి తెలిసి బాధపడేవాడు. ఎందుకు జనాలు ఇలా ఉంటారు అని తలచుకుని తీవ్రంగా మధనపడేవాడు. అలా ఆ ఆవేదన కాస్తా ఇవన్నీ జరగటం ఆగేవరకు స్నానం చేయకూడదనే నిర్ణయానికి వచ్చాడు. అలా ధరమ్‌దేవ్ ఇవన్నీ ఆగేవరకు స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

ఈ సమస్యల పరిష్కారం కోసం ఓ గురువుని ఆశ్రయించాడు ధరమ్​దేవ్. 6 నెలలు గడిపిన అనంతరం.. అతడు అప్పటి నుంచి స్నానం చేయకూడదని నిశ్చయించుకున్నారు. ధర్మదేవుడు శ్రీరాముడిని ఆదర్శంగా భావించి ఆయన మాటలను గుర్తు చేసుకుంటూ జీవిస్తాడు. 22 ఏళ్ల నుంచి నుంచి స్నానం చేయకపోయినా ధరమ్​దేవ్ ఆరోగ్యంగానే ఉండటం విశేషం.