బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి? డీకే శివకుమార్‌తో మంతనాలు

రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది మల్లారెడ్డి ఫ్యామిలీ.

Malla Reddy Meets Dk Shivakumar : బీఆర్ఎస్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు మల్లారెడ్డి, ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. బెంగళూరులోని ఓ హోటల్ లో డీకే శివకుమార్ తో మంతనాలు జరుపుతున్నారు మల్లారెడ్డి. రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు మల్లారెడ్డి ఫ్యామిలీ.

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేశారు. ఆ తర్వాతి రోజే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదని, బీఆర్ఎస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఇంతలో.. సడెన్ గా పరిణామాలు వేగంగా మారిపోయాయి. కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో బెంగళూరులో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడం, మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపింది. ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం.

Also Read : కేసీఆర్‌కు ఆరూరి రమేశ్‌ షాక్.. బీజేపీలో చేరడానికి ఢిల్లీకి పయనం

 

ట్రెండింగ్ వార్తలు