KTR : దమ్ముంటే రా.. మల్కాజిగిరిలో తేల్చుకుందాం- సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి ఏదో భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది.

KTR Challenge CM Revanth Reddy

KTR : సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఇద్దరం ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి మల్కాజ్ గిరిలో పోటీ చేద్దామా అని చాలెంజ్ చేశారు కేటీఆర్. ”నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. సీఎం పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా చేయాలి. మల్కాజ్ గిరిలో ఇద్దరం తేల్చుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దాం” అని సీరియస్ కామెంట్స్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు కరవు అయ్యారని, తమ పార్టీ నేతలకు గాలం వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సునీతా మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, కంచర్ల శేఖర్ రెడ్డికి అవకాశం ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ అన్నారు.

”రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా. త్వరలోనే బిల్డర్లు రోడ్ పైకి వస్తారు. ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణ అనుమతి ఇవ్వడం లేదు. 111 జీఓ అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మేరకు ఎత్తివేశాం. ప్రస్తుతం మా ఫోకస్ అంతా తెలంగాణపైనే. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా? ఓడిపోతే కాదా? రేవంత్ కు ఏదో భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. మగాడివైతే 2లక్షల రుణమాఫీ చేయాలి. మహిళలకు పెన్షన్ ఇవ్వాలని మేము అడగలేమా?

జాతీయ దర్యాప్తు, ఏజెన్సీల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంత నమ్మకం ఉందా? ఉత్తమ్.. రిజర్వాయర్ కు, బ్యారేజ్ కు తేడా తెలుసుకోవాలి. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కొత్తగా భాద్యతలు చేపట్టారు. అన్నీ తెలుసుకుంటే మంచిది. కేసీఆర్ ను బద్నాం చేద్దామని అనుకుంటే.. మాకు ఇబ్బంది లేదు. కానీ, మరమ్మతులు వెంటనే చేయండి. రాజకీయ వేధింపులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. రెండు రోజుల్లో NDSA దేశంలో ఎక్కడైనా నివేదికను ఇచ్చిందా? రేవంత్ అసెంబ్లీలో చెప్పినట్లు మీకు చేతగాకపోతే మాకు అప్పగించండి. ఇరిగేషన్ శాఖ ఇస్తారా? ప్రభుత్వం నుంచి తప్పుకుంటారా?

కాళేశ్వరంకు 400 అనుమతులు వచ్చాయి. అనుమతులు ఇచ్చిన వారు శుంఠలా? వెదిరే శ్రీరాం తెలివైన వారా? ఎంపీ టికెట్ కోసం ఆయన మాట్లాడుతున్నారు. మీకు చేతగాకపోతే తప్పుకోండి. హరీశ్ చెప్పినట్లు మేము నీటిని ఎత్తి చూపిస్తాం. NDSA రాజకీయ ప్రేరేపిత నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రభుత్వానికి కాకుండా మీడియాకు ఎలా అందింది? నిపుణుల కమిటీ వేసి.. వర్షాలు ప్రారంభం అయ్యేలోపు మరమ్మత్తులు చేయండి. మేడిగడ్డకు పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేయండి. పాలమూరు ప్రాజెక్టులో 80శాతం పని పూర్తైంది.

కాలువలు తవ్వి నీళ్లు ఇస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుంది. అన్ని రిజర్వాయర్లు కట్టాము. పోటీ యాత్రలు చేయడం కాలయాపన. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. 80 రోజుల పాలన.. ఆరోపణలు, శ్వేతపత్రాలు అంటూ కాలక్షేపం. NDSA సాంకేతిక బృందం ఎక్కడైనా శాంపిల్ సేకరించిందా? కనీసం బ్యారేజీకి కూడా వెళ్లలేదు. కాంగ్రెస్ మంత్రులకు సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. ఇరిగేషన్ మంత్రి స్వయంగా తెలుసుకోవాలి. ప్రజల దృష్టిని మళ్లించే యత్నం. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా.. ఇవ్వకపోవడం బాధాకరం.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తాము. రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. దాదాపు 200 మంది నేతలం వెళతాం. మేడిగడ్డలో పగుళ్లను పరిశీలిస్తాము” అని కేటీఆర్ అన్నారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‎‎ దృష్టి.. పరిశీలనలో వీరి పేర్లు..

 

 

ట్రెండింగ్ వార్తలు