మూగబోయిన మైకులు : మున్సిపల్ ఎన్నికలు 22న ఓటింగ్

  • Publish Date - January 20, 2020 / 12:14 PM IST

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు 48 గంటల్లో జరుగనున్నాయి. 2020, జనవరి 20వ తేదీ సాయంత్రం ప్రచార గడువు ముగిసింది. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్‌లలో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు పడింది. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

* మున్సిపాల్టీలో 2 వేల 647 వార్డులకు ఎన్నికలు. 
* మున్సిపాల్టీల బరిలో 11 వేల 153 మంది అభ్యర్థులు. 
* 9 కార్పొరేషన్‌లోని 325 డివిజన్లలో ఎన్నికలు.

* కార్పొరేషన్ బరిలో వేయి 745 మంది అభ్యర్థులు.
* 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్‌లలో మొత్తం 3 వేల 052 వార్డులు.
* 80 వార్డులు ఏకగ్రీవం. 
* 2 వేల 972 స్థానాలకు ఎన్నికలు.

 

జనవరి 25వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. ప్రసార, ప్రచార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలను ఎన్నికల సంఘం నిషేధం విధించింది. బల్క్ మెసేజ్‌లను బ్యాన్ చేశారు. 

 

* మున్సిపల్ ఎన్నికల బరిలో 12 వేల 898 మంది అభ్యర్థులు.
* 69 ఏకగ్రీవం చేసుకున్న టీఆర్ఎస్.
* మూడు వార్డుల్లో ఎంఐఎం ఏకగ్రీవం. 
* టీఆర్ఎస్ నుంచి 2 వేల 972 మంది అభ్యర్థులు.
* కాంగ్రెస్ నుంచి 2 వేల 616, సీపీఐ నుంచి 177, సీపీఎం నుంచి 166, ఎంఐఎం నుంచి 276, బీజేపీ నుంచి 2 వేల 313, టీడీపీ నుంచి 347, స్వతంత్ర అభ్యర్థులు 3 వేల 750 మంది. 

భారతదేశంలోనే తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా..ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని 6 వార్డుల్లో, 10 పోలింగ్ కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. రికగ్నైజేషన్ యాప్ అమలుకు ప్రత్యేక పోలింగ్ అధికారిని నియమించారు. 

* బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు.
* తెలుపు రంగులో బ్యాలెట్. 
* నా ఓటు యాప్ ద్వారా ఓటర్ స్లిప్ డౌన్ లోడ్‌కు వెసులుబాటు. 
* 44 వేల ఎన్నికల సిబ్బంది. 

 

* ఎన్నికల సిబ్బంది కోసం ఆన్ లైన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం. 
* ఎన్నికల ప్రాంతాల్లో జనవరి 22న సెలవు. 
* ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. పోలింగ్ ప్రక్రియ వీడియో రికార్డు. 
* పోలింగ్ సరళి తెలుసుకొనేందుకు వెబ్ కాస్టింగ్. 144 సెక్షన్ అమలు. 
 

Read More : అమరావతి కోసం రాజీనామా చేస్తారా మంత్రి కొడాలి నాని సవాల్