CBI JD Lakshmi Narayana : పొలంబాట పట్టిన మాజీ సిబిఐ జేడి….కౌలురైతుగా సేద్యంలోకి…

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతయ్యారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు.

Cbi Jd Lakshmi Narayana

CBI ex JD Lakshmi Narayana as farmer in east godavari district : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతయ్యారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మెట్ట ప్రాంతంలో స్వయంగా తానే కౌలుకు వ్యవసాయం చేసేందుకు గానూ, పొలం బాటపట్టారు.

తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర 10 భూమిని కౌలుకు తీసుకొని ఏరువాక సాగించారు. కౌలుకు తీసుకున్న భూమిలో ట్రాక్టర్‌తో తానే స్వయంగా దుక్కి దున్నారు. తాను ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి కౌలు రైతులు, యువతుల సమస్యలపై దృష్టి సారించానని జేడీ చెప్పారు.

ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇస్తున్నా..అవి రైతులకే గానీ, కౌలు రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కూడా లక్ష్మీ నారాయణ రైతు సమస్యలపై అధ్యయనం చేశారు.. వాటి పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పొలాన్ని కౌలుకు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.