ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు

ఇప్పటికే లిక్కర్ కేసులో 2022 డిసెంబర్ లో కవితను ఓసారి విచారించింది సీబీఐ. హైదరాబాద్ లో కవిత నివాసంలో 7 గంటలు పాటు విచారించింది.

CBI Summons To MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 2022 డిసెంబర్ లో కవితను ఓసారి విచారించింది సీబీఐ. హైదరాబాద్ లో కవిత నివాసంలో 7 గంటలు పాటు విచారించింది. మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి దర్యాఫ్తు సంస్థలు విచారణను వేగవంతం చేసే దిశగా ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగా రాజకీయ ప్రముఖులకు వరుసగా నోటీసులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవితకు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది సీబీఐ. 2022 డిసెంబర్ 11న హైదరాబాద్ లో కవితను ఆమె నివాసంలోనే సుమారు ఏడు గంటలపాటు సీబీఐ విచారించింది. సీఆర్ పీసీ 160 కింద ఆమె స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇదే కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కూడా దర్యాఫ్తు జరుపుతోంది.

ఈడీ సైతం వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే, సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణకు సంబంధించి అంశం పెండింగ్ లో ఉంది. 2023లో ఈడీ విచారణకు కవిత మూడుసార్లు హాజరయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత వరుసగా గైర్హాజరు అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాఫ్తుని త్వరితగతిన 6 నెలల్లో పూర్తి చేయాలని దర్యాఫ్తు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాఫ్తును త్వరగా ముగించాలని దర్యాఫ్తు సంస్థలు ముందుకు కదిలాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ నోటీసులు ఇస్తున్నారు.

Also Read : కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగింది- సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు